రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏటా సుమారు 2.45 లక్షల మంది శిశువులకు కిట్లు అందించనున్నారు. ఇందుకోసం ఏటా రూ.51.15 కోట్ల బడ్జెట్ కేటాయించగా, ఒక్కో కిట్ ధర రూ.1,400.22గా ఉంది. శిశువులకు తొలి దశలో అవసరమైన వెచ్చదనం, పరిశుభ్రత, భద్రతతో పాటు ప్రాథమిక సంరక్షణ అందేలా కిట్లను రూపొందించారు.
కిట్‌లో దోమల నివారణ వలతో కూడిన బేబీ బెడ్, బేబీ మాకింటోష్, శిశువుల దుస్తులు, టవల్, మూడు న్యాపీలు, బేబీ పౌడర్, షాంపూ, బేబీ ఆయిల్, సబ్బు, రాటిల్ టాయ్, కిట్ బ్యాగ్ తదితర వస్తువులు ఉంటాయి.